India Badminton: సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ఎంపిక 7 d ago

చైనాలో ఈ నెలలో జరిగే ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్ మిక్స్ డ్ టీమ్ చాంపియన్ షిప్ టోర్నీకి భారత జట్టును, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి మే 4 వరకు టోర్నీ జరగనుంది. భారత్ జట్టులో 14 మందిని ఎంపిక చేయగా.. మెన్స్ సింగిల్స్ లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ఉమెన్స్ సింగిల్స్ లో పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ ఎంపికయ్యారు. యువ జంట ప్రియా-శ్రుతి మిశ్రా జంటకు భారత జట్టులో చోటు లభించింది. మిక్స్ డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీషా, సతీశ్-ఆద్య జంటలు ప్రాతినిధ్యం వహించనున్నాయి.